![Actress Mahek Chahal Reveals About Why She Split With Ashmit Patel - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/6/1.jpg.webp?itok=OW_Uy6RX)
'నయీ పడోసన్' సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది నటి మహేక్ చాహల్. తర్వాత బిగ్‌బాస్ హిందీ సీజన్ 5లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ భామ అభిమానుల అండతో రన్నరప్‌గా నిలిచింది. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఖత్రోన్ కె ఖిలాడీ 11వ సీజన్ కోసం కేప్‌టౌన్ పయనమైంది. తన బాయ్‌ప్రెండ్ అస్మిత్ పటేల్‌కు బ్రేకప్ చెప్పినట్లు వస్తున్న వార్తలపై మహేక్ చాహల్ స్పందించింది.
'నేనే మా బంధానికి ముగింపు పలికాను. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తావో, అతడితోనే కలిసి ఉంటావో అప్పుడు ఆ వ్యక్తి నిజస్వరూపం తెలుస్తుంది. అస్మిత్ నాకు సరైనోడు కాదనిపించింది. బ్రేకప్ తర్వాత పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. కానీ నా ఫ్యామిలీ, స్నేహితులు నాకు మద్దతుగా నిలబడ్డారు. నా సమస్యలను వారితో చెప్పుకున్నాను. నేను ఓ ఏడాదిపాటు గోవాలో ఉండిపోయాను. అక్కడి ప్రకృతి నన్ను కోలుకునేలా చేసింది. సమయం అన్నింటినీ నయం చేస్తుంది, అలాగే నన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చింది' అని చాహల్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment