
సాక్షి, చిత్తూరు: హీరోయిన్ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. తను నటించిన బౌబౌ సినిమా విడుదలకు సిద్దంగా వుందన్నారు. థీయేటర్లలో రిలీజ్ చేయాలా లేదా ఓటిటిలో చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వుందని తెలిపారు. త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. నమితా థియేటర్ పేరుతో ఓటిటి, నమిత ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment