2022.. బోలెడన్ని హిట్స్‌తో పాటు ఎన్నో ఫ్లాపులను కూడా మిగిల్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయిన సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అటు ఓటీటీ సంస్థలు కూడా సినిమాలు, వెబ్ సిరీస్, షోలతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. మరి 2023 జనవరి మొదటివారం ఆహాలో విడుదల కాబోతున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం..
అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే: బాహుబలి 2 ఎపిసోడ్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఇరగదీస్తున్న షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలే ఈ షోకి ప్రభాస్, గోపీచంద్ రాగా ఇందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాల్ స్ట్రీమ్ అవుతోంది. రెండో ఎపిసోడ్ చూడాలంటే మాత్రం ఈ శుక్రవారం దాకా ఆగాల్సిందే!
కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్- ఎపిసోడ్ 5
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షో కామెడీ ఎక్స్‌చేంజ్. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఎక్స్‌ప్రెస్ హరి, ముక్కు అవినాష్, వేణు, సద్దాం, బుల్లెట్ భాస్కర్, జ్ఞానేశ్వర్ ఇలా పలువురు కమెడియన్లు పాల్గొంటున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ షో ఐదవ ఎపిసోడ్ శుక్రవారం రిలీజ్ కానుంది.
స్కూల్ 2017 (కొరియన్ షో)
కొరియన్ సిరీస్ ఇష్టపడేవారి కోసం మరో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తెస్తోంది ఆహా. ఈ సిరీస్ శనివారం ప్రసారం కానుంది.
చదవండి: సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్, తారక్ ఏం చేశారంటే?
ఏమున్నాడ్రా బాబూ.. హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ లుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment