
సోషల్ మీడియా అంటే కొంత బిడియం, భయం.. అందుకే దాన్ని ఎక్కువ వాడను, ఎక్కువ పోస్టులు పెట్టను. కేవలం నా సినిమాల
ఏజెంట్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం ఈ యంగ్ గ్రౌండ్‌లో దుమ్ము దులుపుతున్నాడు. సీసీఎల్‌లో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగిస్తున్నాడు. సీసీఎల్ కోసం ప్రాక్టీస్‌లో ఉన్న అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'వీళ్లందరూ నాకు ప్లేయర్స్‌గా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉంటారు. స్కూల్‌లో ఓ పక్క క్లాసులు జరుగుతుంటే వెళ్లి క్రికెట్ ఆడేవాళ్లం.. ఇలా చాలాసార్లు దొరికాం. క్రికెట్ ఆడే క్రమంలో ఎన్నో కిటికీల అద్దాలు పగలగొట్టాను. క్రీడలు ఆడటం అంటే నాకు చాలా ఇష్టం.
నాకు సోషల్ మీడియా ఎక్కువ తెలియదు. సోషల్ మీడియా అంటే కొంత బిడియం, భయం.. అందుకే దాన్ని ఎక్కువ వాడను, ఎక్కువ పోస్టులు పెట్టను. కేవలం నా సినిమాల గురించి మాత్రమే అప్‌డేట్ ఇస్తాను. దానివల్ల నా అభిమానులు నన్ను మిస్ అవుతూ ఉంటారు. నా పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను సింగిల్‌గానే ఉన్నాను. మింగిల్ అయ్యే ఆలోచన లేదు. నాకు లవ్ అంటే స్పోర్స్ట్ అంతే అని చెప్పుకొచ్చాడు అఖిల్.
అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. అతడు హీరోగా నటించిన ఏజెంట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. సాక్షి వైద్య కథానాయికగా అలరించిన ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, దీపారెడ్డి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.