Akhil Akkineni Agent Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Agent Movie: అఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Sat, Feb 4 2023 3:08 PM | Last Updated on Mon, Apr 17 2023 11:06 AM

 Akhil Akkineni Agent Movie Release Date Fix On 28th April - Sakshi

అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్‌ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.  ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుందని అక్కినేని అఖిల్ ట్వీట్ చేశారు. 

సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా టీజర్‌లోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండనున్నాయి. వాస్తవంగా ఈ మూవీని 2022లోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా వీలు కాలేదు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌ పలుసార్లు వా​యిదా పడుతూ వచ్చింది. తాజా ప్రకటనతో ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement