
Akshay Kumar Rakul Preet Singh Cinderella In OTT As Web Series: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన సైకో థ్రిల్లర్ మూవీ 'సిండ్రెల్లా'. రంజిత్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన 'రత్సాసాన్'కు రీమేక్. తెలుగులో 'రాక్షసుడు'గా వచ్చింది. అయితే ఈ మూవీని ముందుగా థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
ఫీచర్ మూవీగా తీసుకురావాలని భావించినా, నిడివి ఎక్కువ కావడంతో వెబ్ సిరీస్‌గా మలిచారు. అలా అయితే ఓటీటీకి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయపడ్డారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను అత్యధిక శాతం బ్రిటన్‌లో పూర్తి చేశారు. సినిమాగా రావాల్సిన సిండ్రెల్లా వెబ్ సిరీస్‌గా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం 'పృథ్వీరాజ్' జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే అక్షయ్ కుమార్ కొవిడ్ సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.
చదవండి: అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
అక్షయ్ కుమార్ సినీ కెరీర్‌కు 30 ఏళ్లు.. ఊహించని సర్ప్రైజ్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment