Alia Bhatt Ranbir Kapoor: Alia Bhatt Missing Ranbine Kapoor | మేజర్‌ మిస్సింగ్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌‌ - Sakshi
Sakshi News home page

మేజర్‌ మిస్సింగ్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌‌

Published Fri, Mar 12 2021 2:09 PM | Last Updated on Fri, Mar 12 2021 3:14 PM

Alia Bhatt Is Missing Ranbir Kapoor While He Is In Quarantine - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్‌ కపూర్‌ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. గతంలో పలువురు బాలీవుడ్‌ భామలతో ప్రేమాయణం నడిపిన రణ్‌బీర్‌ ఎట్టకేలకు ఆలియాను పెళ్లాడుతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తమ  వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జ‌రిగి ఉండేద‌ని తెలిపాడు. కాగా ఎప్పటికప్పుడు పార్టీలు, డిన్నర్‌ డేటింగులతో షికారు చేసే ఈ జంట తాజాగా ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్నారు. ఇటీవలె రణ్‌బీర్‌కు కరోనా సోకడంతో ప్రస్తుతం అతను క్వారంటైన్‌లో ఉన్నాడు.

దీంతో ప్రియుడిని కలిసే అవకాశం లేకపోవడంతో ఆలియా చాలా బాధపడిపోతుంది. ప్రియుడు రణ్‌బీర్‌ చేతిలో చేయి వేసి ఉన్న ఓల్డ్‌ ఫోటోను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి మేజర్‌ మిస్సింగ్‌ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. అయితే అది ఎవరి చేయి అన్నది ఆమె చెప్పకపోయినా.. ఫ్యాన్స్‌ మాత్రం అది రణ్‌బీర్‌దేనని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆలియా భట్‌కి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో త్వరలోనే ఆమె షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆలియా 'ఆర్‌ఆర్‌ఆర్'‌, ‘గంగూబాయి కతియావాడి’సహా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో నటిస్తున్నారు. 

చదవండి : (తనే నా గర్ల్‌ ఫ్రెండ్‌, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్‌)
(గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement