
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, బన్నీ పిటిషన్ దాఖలుపై కౌంటర్ వేసేందుకు ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాది సమయం కోరారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 30కి వాయిదా పడింది.
సంధ్య థియేటర్ ఘటనలో ఆన్‌లైన్ ద్వారా నాంపల్లి కోర్టు విచారణలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment