Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షల సాయం | Allu Arjun Breaks Silence On Woman Death At Pushpa 2 Premieres In Sandhya Theatre, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Allu Arjun: మీ లోటు పూడ్చలేను.. మీ కుటుంబానికి నేనున్నా..

Published Fri, Dec 6 2024 9:54 PM | Last Updated on Sat, Dec 7 2024 6:47 AM

Allu Arjun Breaks Silence on Woman Death at Pushpa 2 Premieres

పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్‌ స్పందించాడు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ వీడియో షేర్‌ చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 'మొన్న నేను పుష్ప ప్రీమియర్స్‌ చూసేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు వెళ్లాను. అక్కడ జనం రద్దీ ఎక్కువ కావడంతో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. 

20 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదు
రేవతి అనే మహిళకు దురదృష్టవశాత్తూ దెబ్బలు తగిలి మరణించింది. ఈ విషయం నాకు సినిమా చూసొచ్చిన తర్వాతి రోజు ఉదయం తెలిసింది. నేను, సుకుమార్‌, పుష్ప టీమ్‌ మొత్తం ఈ వార్త చదివి ఎంతగానో బాధపడ్డాం. 20 ఏళ్లుగా ప్రతి సినిమాకు ఒక ప్రధాన థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సడన్‌గా ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయాం.

తట్టుకోలేకపోయాం..
అందుకే పుష్ప సెలబ్రేషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాం. మేము సినిమాలు తీసేదే జనాలు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్‌ చేయడానికి.. అలాంటిది థియేటర్‌లోనే ఇలాంటి విషాదం జరిగేసరికి తట్టుకోలేకపోయాం. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము ఏం చేసినా మీరు లేని లోటును పూడ్చలేం.

మీ కోసం నేనున్నా: అల్లు అర్జున్‌ 
కానీ మీ కుటుంబం కోసం మేమున్నామ. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేస్తాం. నా తరపున రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నాను. మీకోసం నేనున్నాను అని చెప్పడానికే ఈ డబ్బు ఇస్తున్నాను. ఇప్పటివరకు అయిన హాస్పిటల్‌ ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని అల్లు అర్జున్‌ మాట్లాడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement