Allu Arjun Financial Help To His Fan Father Medical Treatment, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun: కష్టాల్లో అభిమాని.. అతడిని గుర్తుపట్టి మరీ ఆదుకున్న బన్నీ

Published Fri, Feb 10 2023 1:45 PM | Last Updated on Fri, Feb 10 2023 3:24 PM

Allu Arjun Helps Fans Father Medical Treatment - Sakshi

కొందరు నలుగురికీ తెలిసేలా సాయం చేస్తారు. మరికొందరు గుప్తదానాలు, గుట్టుచప్పుడు కాకుండా సాయాలు చేస్తారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రెండో కోవలోకి వస్తాడు. ఆపత్కాలంలో అభిమానులను ఆదుకుని వారికి అండగా నిలుస్తాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందీ ఘటన. అర్జున్‌ కుమార్‌ అనే బన్నీ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి వైద్యం చేయించడానికి రెండు లక్షలు అవసరమైంది. అతడి కుటుంబానికి అంత డబ్బు చెల్లించే స్థోమత లేదు. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దాతలు తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

ఈ విషయం గీతా ఆర్ట్స్‌ కంటెంట్‌ హెడ్‌ శరత్‌ చంద్ర నాయుడు దృష్టికి రావడంతో ఆయన బన్నీని స్వయంగా కలిసి పరిస్థితి వివరించాడు. దీంతో బన్నీ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని ముందుకు వచ్చాడు. చికిత్సకు అవసరమైనంత డబ్బును పంపించి కష్టాల్లో ఉన్న అభిమానిని ఆదుకున్నాడు. తన ఫేవరెట్‌ హీరో సాయం చేయడంతో అభిమాని అర్జున్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'నన్ను గుర్తుపెట్టుకున్నావు, నా ఫోటో చూడగానే నేను తెలుసన్నావు. ఆనందంతో ఏడ్చేశాను అన్నా.. నా కుటుంబానికి సాయం చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: అందాల రాముడు చేయనని చెప్పాను.. కమెడియన్‌ సునీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement