కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా స్టార్లకు కావాల్సినంత బ్రేక్ దొరికింది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే వాళ్లంతా గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే పనిలో ఉన్నార. బన్నీకి ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం దొరికిన ఈ బ్రేక్‌ని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ సరదగా గడుపుతున్నారు. పిల్లల అల్లరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పొస్ట్ చేస్తుంటారు. తాజాగా తన పిల్లల డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు బన్నీ. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: 6 నిమిషాలకు 6 కోట్లు)
‘ఫైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ పేరుతో షేర్ చేసిన ఈ వీడియోలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్, అతని కజిన్ హాలీవుడ్ మూవీ ఐటీలోని పెన్నీవైస్ను అనుకరిస్తూ.. తనలాగా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు. కాసేపటికి అర్హా కూడా అన్నతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. పిల్లల అల్లరి చూసి బన్నీ నవ్వుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఎంత క్యూట్‌గా డ్యాన్స్ చేశారో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ, సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment