
విశాఖపట్నం: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విశాఖకు బై బై చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప–2 (ది రూల్) సినిమా షూటింగ్ కోసం గత నెల 20న ఆయన వైజాగ్ వచ్చారు. ఫిషింగ్ హార్బర్, పోర్టు, అప్పుఘర్ ప్రాంతాల్లో 18 రోజుల పాటు నిర్విరామంగా సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. మంగళవారం గాదిరాజు ప్యాలస్, రుషికొండలోని రాడిసన్ బ్లూలో అభిమానులతో ఫొటోషూట్ నిర్వహించారు. ఆ సమయంలో నగరానికి చెందిన వీరాభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు వచ్చారు. ఆ అభిమాని దివ్యాంగుడు కావడం గమనించి అల్లు అర్జున్.. అతన్ని ఎత్తుకుని ఫొటో దిగారు. సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment