అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ | Anasuya Bharadwaj Thank You Brother First Look Poster Released | Sakshi
Sakshi News home page

అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’

Published Fri, Nov 27 2020 7:55 PM | Last Updated on Sat, Nov 28 2020 5:10 AM

Anasuya Bharadwaj Thank You Brother First Look Poster Released - Sakshi

అనసూయ భరద్వాజ్, అశ్విన్‌ విరాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా క్యాస్ట్‌ రివీల్‌ పోస్టర్‌ని హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆవిష్కరించారు. ‘‘రానా ఆవిష్కరించిన టైటిల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. టైటిల్‌ పోస్టర్‌ రివీల్‌ అయినప్పుడు సినిమా కథకూ, లిఫ్ట్‌కూ ఏదో సంబంధం ఉందనే విషయం అర్థం కాగా, ఇప్పుడు రివీల్‌ చేసిన పోస్టర్‌లో ఆ లిఫ్ట్‌లో అనసూయ, విరాజ్‌ ఎడముఖం, పెడముఖం పెట్టుకొని నిలబడి కనిపించడంతో సినిమా కంటెంట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు, సంగీతం: గుణ బాల సుబ్రమణియన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement