సెల్యూన్ రంగంలో నేచురల్స్ అనుబంధ బ్రాండ్‌గా నెయిల్స్ N బియాండ్ ప్రారంభమైంది. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం. నెయిల్ ఆర్ట్ విషయంలో మగువలు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. అలాంటి వాళ్ళందరి కోసం నెయిల్స్ N బియాండ్ ఎన్నో రకాల వైవిధ్యమైన నెయిల్ ఆర్ట్ ఉత్పత్తులను, నెయిల్ ఆర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్‌లో రెండో ఫ్లోర్‌లో నెయిల్స్ N బియాండ్ షో రూమ్ ప్రారంభ కార్యక్రమంలో వర్షిణి పాల్గొంది. అమ్మాయిలందరి ఫేవరేట్‌గా నెయిల్స్ N బియాండ్ నిలుస్తుందని వర్షిణి చెప్పింది. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ షాప్స్ ప్రతి గల్లీలోనూ ఉన్నాయని, ఇది బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అని వర్షిణి అభిప్రాయపడ్డారు.
నెయిల్స్ N బియాండ్ త్వరలోనే మరో బ్రాంచ్ ని ప్రారంభించుకోవాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. నెయిల్స్ N బియాండ్ బాగా సక్సెస్ కావాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment