
‘ప్రేమమ్’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అనుపమ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
చదవండి: నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్
ఇప్పటివరకు తెరపై, బయటక అచ్చ తెలుగు ఆడపల్లల కనిపించిన అనుపమ తాజా ఫొటోల్లో గ్లామర్ షో ప్రదర్శించింది. అంతేకాదు ఈ పోస్ట్‌కు ఆసక్తికర రితీలో క్యాప్షన్ ఇచ్చి తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను ఆలోచనలో పేడిసింది. తొలిసారి ఆమె గ్లామర్ ఫొటోలు షేర్ చేయడంతో అవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.బ్యాక్ లెస్ ట్రెండీ డ్రెస్‌లో హాట్‌హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చిన తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ ‘ఏ సమయంలో నిన్ను నవ్వించాలి.. స్పైస్ చేయాలో అతనికి తెలిసినప్పుడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే అనుపమ షేర్ చేసిన ఫోటోలకు కొందరు ‘బ్యూటీఫుల్, హాట్’ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ‘నీకు సెట్ కాలేదు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
అలాగే ఆమె క్యాప్షన్ చూసి ఇప్పటి వరకు సింగిల్‌గా ఉన్నా. మింగిల్ అయిపోయిందా? అంటూ నెటిజ్లను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారి ఇలా గ్లామర్ లుక్‌లో అనుపమ కనిపించడంతో ఆమె ఫొటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కాగా గతంలో అనుపమ తాను సింగిల్.. కాదు మింగిల్ అంటూ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నేను సింగిల్.. కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment