నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి | Ashu Reddy Engagement Pics And Clarity By Her | Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషు ఎంగేజ్‌మెంట్.. ఇదీ అసలు సంగతి

May 9 2026 3:50 PM | Updated on May 9 2026 4:00 PM

Ashu Reddy Engagement Pics And Clarity By Her

ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుందని చీటింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి.. నిన్న(మే 08) వేలిక ఉంగరం, మరో వ్యక్తి చేతిలో చేయి వేసి ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడో సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు స్వయంగా అషురెడ్డినే సమాధానమిచ్చింది. మరిన్ని ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.

(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. ఆశీర్వదించిన చిరు)

బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత పలు చిత్రాల్లో ఒకటి అరా పాత్రలు చేసిన అషురెడ్డి.. వీటి కంటే గ్లామరస్ ఫొటోషూట్స్‌తోనే ఫేమ్ తెచ్చుకుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన రెండు ఇంటర్వ్యూలు.. ఈమెపై చాలామంది విమర్శలు చేసేందుకు కారణమయ్యాయి. ఇవన్నీ అలా ఉండగానే ఈమె చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆ విషయం కాస్త వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని ఈమె తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు.

ప్రస్తుతానికైతే చీటింగ్ కేసు విషయమై అషురెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సోమవారం విచారణకు హాజరవ్వాలని హైదరాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే నిశ్చితార్థం అనుకునేలా కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో అంతా నిజమేనని అనుకున్నారు. కానీ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే సిరీస్ షూటింగ్ కోసం తీసుకున్న ఫొటోలు ఇవని తేలింది. సదరు షూటింగ్ ఫొటోలు, వీడియో పోస్ట్ చేసి అషురెడ్డి.. మీరు చూసేదంతా, వినేదంతా నిజం కాదు అని క్యాప్షన్ రాసుకొచ్చింది. గత ఫొటోల్లో అషురెడ్డితో కనిపించిన చెయ్యి మరెవరిదో కాదు బిగ్‌బాస్ 8 విజేత నిఖిల్ మళయక్కల్‌ది. అదన్నమాట సంగతి.

(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)

Advertisement
 
Advertisement
Advertisement