
బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'రివేంజ్'. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'రివెంజ్ దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, దర్శకుడు. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. దర్శకుడు, హీరో కమ్ ప్రొడ్యూసర్ ఇద్దరూ కూడా సినిమా అంటే ఎంతో ప్యాషన్, డెడికేషన్ ఉన్న వ్యక్తులు' అన్నారు.
హీరో, నిర్మాత బాబు పెదపూడి మాట్లాడుతూ.. 'అబ్రాడ్‌లో ఉంటూనే త్రివిక్రమ్ గారి `అతడు`, దశరథ్ గారి `శ్రీ` సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేశాను. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్న బిజీ వల్ల చేయలేకపోయాను. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది. ఒక మంచి నటుడిగా నన్ను పరిచయం చేయడానికి నాకోసం చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతాం అనేది సినిమా' అన్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. '30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజయ్ భాస్కర్, వంశీ గార్ల వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేశాను. పొదరిల్లు, ఐపిసి సెక్షన్ రెండు సినిమాలు డైరక్ట్ చేశాను. ఇది నా మూడో సినిమా' అన్నారు.
చదవండి: లాభాలు తేవడం చేతకాదు కానీ కోట్లకు కోట్లు కావాలి: నిర్మాత
దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిన సన్నీ
Comments
Please login to add a commentAdd a comment