క్రేజీ డైరెక్టర్‌తో బాలయ్య తదుపరి చిత్రం! | Balakrinshna Next Film with Director Anil Ravipudi | Sakshi
Sakshi News home page

క్రేజీ డైరెక్టర్‌తో బాలయ్య తదుపరి చిత్రం!

Published Fri, Jul 31 2020 11:14 AM | Last Updated on Fri, Jul 31 2020 2:35 PM

Balakrinshna Next Film with Director Anil Ravipudi - Sakshi

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్రంలోని ఒక డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయ్యింది. బాలయ్య కూడా ఈ చిత్రంలో మునుపటి కంటే పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. అయితే, లాక్‌డౌన్ నిబంధనల కారణంగా అన్నిసినిమాల లాగానే షూటింగ్‌కు కూడా బ్రేక్‌ పడింది. బాలయ్య చేయబోయే తదుపరి సినిమాపై తాజా వార్త ప్రచారంలోకి వచ్చింది.

'ఎఫ్ -2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారట. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఆయన కోసం ఓ కథను సిద్ధం చేశాడట. త్వరలోనే బాలయ్యతో స్క్రిప్టుకి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పటాస్‌ తరువాత నుంచే అనిల్‌ రావిపూడి బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాను నిర్మించడానికి దిల్‌ రాజు ఆసక్తి చూపిస్తున్నట్టు సినీవర్గాల సమాచారం. అనిల్‌ రావిపూడి.. ఎఫ్‌3 సినిమాను తెరకెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ సినిమాకు బ్రేక్‌ పడింది. ఇక కామెడీకి, డిఫరెంట్‌ స్టైల్‌కు పెట్టింది పేరైనా అనిల్‌ రావిపూడి ఇప్పటి వరకు తాను చేసిన  ప్రతి సినిమాలో హీరోను డిఫరెంట్‌గా చూపించాడు. బాలయ్య ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఆయనను అనిల్‌ రావిపూడి ఎలా చూపిస్తాడో చూడాలి.  చదవండి: బాలయ్య అభిమానులకు మరో కానుక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement