బిగ్‌బాస్‌ : మోనాల్‌ని ముద్దు అడిగిన అఖిల్‌! | Bigg Boss 4 Telugu : Akhil Wants Kiss To Monal | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : మోనాల్‌ని ముద్దు అడిగిన అఖిల్‌!

Nov 1 2020 4:04 PM | Updated on Nov 1 2020 6:14 PM

Bigg Boss 4 Telugu : Akhil Wants Kiss To Monal - Sakshi

అనారోగ్యంతో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన నోయల్‌.. నిన్న స్టేజ్‌ మీదకు మీదకు వచ్చి అవినాష్‌, అమ్మ రాజశేఖర్‌పై చిందులు వేయడంతో హౌస్‌లో హీట్‌ బాగా పెరిగింది. ‘చిల్లర కామెడీ’  వాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్న అవినాష్‌, అమ్మ రాజశేఖర్‌ కోపంతో రగిలిపోతున్నారు. దీంతో అందరిని కూల్‌ చేసే పనిలో పడ్డారు హోస్ట్‌ నాగార్జున. సండే ఫన్‌డే కావడంతో అందరి కామెడీ టాస్క్‌లు ఇచ్చి హౌస్‌లో నవ్వులు పూయించారు. హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టి డాన్స్‌ చేయించారు. ఈ టాస్క్‌లో మోనాల్‌, సోహైల్‌ రెచ్చిపోయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. తమదైన శైలీలో స్టెప్పులేస్తూ అందరిని అలరించారు.

ఇక మాస్టర్‌, హారికల జంట కూడా నాగ్‌ పాటకు స్టెప్పులేసి నవ్వులు పూయించారు. ఇక మరో టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ ఒకరినొకరు ఇమిటేట్‌ చేశారు. దీంట్లో భాగంగా అఖిల్‌ అవినాష్‌ను ఇమిటేట్‌ చేశాడు. మోనాల్‌ దగ్గరికి వెళ్లి కిస్‌ ఇవ్వగా అని అడిగాడు. పక్క ఉన్న అరియానా..అవినాష్‌ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్‌ నాకు కిస్‌ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ అఖిల్‌(అవినాష్‌) మాట మారుస్తాడు. అచ్చం అవినాష్‌ చేసినట్లే అఖిల్‌ చేయడంతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జుక కూడా పగలపడి నవ్వాడు. అలాగే హారిక లాగా అవినాష్‌ ఇమిటేట్‌ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్‌ మాస్టర్‌లాగా సోహైల్‌, అవినాష్‌లు ఇమిటేట్‌ చేస్తూ కోపంలో మాస్టర్‌ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్‌ చేసిన అవినాష్‌.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement