బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు దాటింది. ఈ మధ్యలో ఓ కంటెస్టెంటు బ్యాగు సర్దేసుకుని బయటకు వెళ్లిపోవడం, బయట ఉన్న ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు లోనికి అడుగు పెట్టడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కానీ హౌస్‌లో ఒక్కటి మాత్రం అసలేమీ మారలేదు. అందరూ తెలుగు మాట్లాడాలన్న నిబంధనను గాలికొదిలేశారు. వచ్చినప్పటి నుంచి తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు కలగలిపేసి మాట్లాడుతున్నారు. దీంతో షో వీక్షిస్తున్న ప్రేక్షకులు అసలు ఇది తెలుగు బిగ్‌బాసేనా అని అసహనం వ్యక్త చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బిగ్‌బాస్ నిమ్మకు నీరెత్తనట్టు ఉండిపోవడం గమనార్హం. (చదవండి: నాతో మాట్లాడతానని ప్రామిస్ చెయ్యు: అభిజిత్)
అయితే సూర్యకిరణ్ వెళ్లిపోయిన తర్వాత తమిళం మాట్లాడటం తగ్గింది. కానీ గుజరాతీ భామ మోనాల్ మాత్రం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే మళ్లీ ఇంగ్లీషు, హిందీలోనే వాగేస్తోంది. అభిజిత్, అఖిల్ కూడా ఈమెతో ఇంగ్లీష్, హిందీలోనే మాట్లాడుతున్నారు. అటు తెలుగు వచ్చిన వాళ్లు కూడా ఇంగ్లీషు, హిందీలోనే ముచ్చటిస్తున్నారు. దీంతో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. ఈ విషయాన్ని లేటుగా అర్థం చేసుకున్న బిగ్‌బాస్ నేడు ఇంటి సభ్యులకు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం ఇంటి నియమాలను ఉల్లంఘించినందుకుగానూ గంగవ్వ మినహా మిగతా హౌస్‌మేట్స్ అందరూ గుంజీలు తీస్తూ కనిపించారు. మరి ఇకనుంచైనా వీళ్లు తెలుగులోనే మాట్లాడతారో, లేదో చూడాలి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇన్నాళ్లకు బిగ్‌బాస్ నిద్ర లేచాడు అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కంటెస్టెంట్లు పిక్నిక్‌కు వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు, కాస్త ఫిజికల్ టాస్కులు కూడా ఇవ్వండి అని సూచిస్తున్నారు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు)
Comments
Please login to add a commentAdd a comment