![Bigg Boss 5 Telugu: Anchor Varshini And Singer Mangli Rejects Bigg Boss 5 Offer - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/15/Bigg-Boss-5.jpg.webp?itok=QnNUMDAB)
బుల్లితెరపై బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 5వ సీజన్ సందడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటికి షో కంటెస్టెంట్స్ స్పష్టత మాత్రం రాలేదు కానీ, అగష్టు 22 నుంచి వారిని క్వారంటైన్‌కు పంపించనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్‌లో యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీలు హౌజ్‌లో సందడి చేయబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది.
ఈ క్రమంలో మంగ్లీ ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ తాజా బజ్ ప్రకారం బిగ్‌బాస్ ఆఫర్‌ను వర్షిణి, మంగ్లీలు తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం మంగ్లీ గాయనీగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బిగ్‌బాస్ షోకు నో చెప్పిందని వినికిడి. ఇక యాంకర్‌గా కెరీర్‌లో నిలదొక్కుకుంటోన్న వర్షిణి కూడా పలు షోలతో బిజీగా ఉన్న కారణంగా బిగ్‌బాస్ ఆఫర్‌ను వదులుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment