
నిన్నటి వరకూ టాలీవుడ్‌లో ఎంతో క్యూట్ కపుల్‌గా ఉండే నాగచైతన్య-సమంత జోడీ.. అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ విడాకులు తీసుకున్నారు. ఇకపై భార్యాభర్తలం కాదంటూ బాంబు పేల్చారు. ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే చైతూ తండ్రి నాగార్జునను ఇది ఎక్కువగానే బాధించి ఉంటుంది. కన్న కొడుకు- కోడలు విడాకులు తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం కష్టమే.
సామ్‌చై విడాకుల విషయం మనసును మెలిపెడుతున్నా నాగ్ బిగ్‌బాస్ స్టేజీ మీదకు వచ్చాడు. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా పెదాలపై చిరునవ్వు చెరగనీయలేదు. ఎప్పటిలాగే ఈ వీకెండ్‌లోనూ కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ తన హోస్టింగ్ బాధ్యతలను దిగ్విజయంగా నిర్వర్తించాడు. ఇంట్లో అంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ బిగ్‌బాస్ కోసం నాగ్ సమయం కేటాయించడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
'పర్సనల్ లైఫ్‌లో అంత జరుగుతున్నా యాంకరింగ్ మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా చేస్తున్నారు, గ్రేట్ నాగార్జున', 'చైసామ్ విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. నాగ్ సర్ మనసులో ఎంత బాధ ఉన్నా మీరు షోలో చూపించే ఎనర్జీ సూపర్', 'నాగార్జున సర్‌ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంట్లో ఇంత జరుగుతున్నా హోస్టింగ్‌లో, తన ఫేస్‌లో దానికి సంబంధించిన విషాద ఛాయలు కనబడకుండా జాగ్రత్తపడుతున్నాడు', 'తన ప్రాబ్లమ్స్ అన్నీ పక్కనపెట్టి బిగ్‌బాస్ కోసం కష్టపడుతున్న నాగ్ సర్‌ను నిజంగా అభినందించి తీరాల్సిందే' అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment