బిగ్‌బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే? | Bigg Boss 8 Telugu Day 23 Promo Kirrak Seetha | Sakshi
Sakshi News home page

Bigg Boss 8: సుత్తి పట్టుకో.. పవర్ అందుకో.. ప్రోమో రిలీజ్

Sep 24 2024 4:36 PM | Updated on Sep 24 2024 4:47 PM

Bigg Boss 8 Telugu Day 23 Promo Kirrak Seetha

బిగ్‌బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఇప్పటికే నామినేషన్స్ పూర్తవగా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌, నైనిక లిస్టులో ఉన్నారు. కాంతార చీఫ్‌గా ఉన్న అభయ్.. ఆదివారం ఎలిమినేట్ కావడంతో ఆ పోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దాని కోసం బిగ్‌బాస్ ఎప్పటిలానే పోటీ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.

గత సీజన్లలో కెప్టెన్లు ఉన్నట్లు ఈసారి బిగ్‌బాస్ హౌసులో చీఫ్స్ ఉన్నారు. కంటెస్టెంట్స్‌ని శక్తి, కాంతార క్లాన్స్ అని పిలిచే గ్రూపులుగా విభజించారు. శక్తి చీఫ్‌గా నిఖిల్ ఉండగా.. కాంతార చీఫ్‌గా అభయ్ ఉండేవాడు. అతడు ఎలిమినేట్ కావడంతో ఆ పోస్ట్ కోసం ఇప్పుడు పోటీ పెట్టారు. నిఖిల్ తప్పితే మిగతా పదిమంది ఫొటోలు స్టాండ్‌పై పెట్టారు. ఇక బజర్ మోగే సమయంలో సుత్తిని ఎవరైతే పట్టుకుంటారో ఓ ఫొటోని పోటీ నుంచి తొలగించొచ్చు.

(ఇదీ చదవండి: ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా)

అలా నిఖిల్, ఆదిత్య బొమ్మని.. పృథ్వీ, మణికంఠ బొమ్మని.. సీత, యష్మి బొమ్మని.. సోనియా, నబీల్ బొమ్మని.. నైనిక, విష్ణుప్రియ బొమ్మని.. సీత, సోనియా బొమ్మని సుత్తితో పగలగొట్టారు. అలా చివరగా సీత-ప్రేరణ మిగిలినట్లు ప్రోమోలో చూపించారు. అయితే షూటింగ్ కంప్లీట్ కావడంతో చీఫ్ ఎవరయ్యరనేది బయటకొచ్చింది. కాంతార క్లాన్‌కి కొత్త చీఫ్‌గా సీత ఎంపికైంది.

హౌస్‌లోకి వచ్చిన కొత్తలో సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏం కాదు. కానీ రోజురోజుకీ తన పాయింట్స్ చెబుతూ హౌసులో గట్టిగా నిలబడుతోంది. ఇక ఈ వారం చీఫ్ అయిపోయింది కాబట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయినట్లే. 

(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement