జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో డబ్స్‌మ్యాష్ వీడియాలతో గుర్తింపు పాపులర్ అయిన అషూ బిగ్‌బాస్ షో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్న అషూ హాట్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
తాజాగా అషూ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన అషూ.. చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇది చూసిన నెటిజన్లు పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో చినిగిన చొక్కా వేసుకున్నావ్ సరే.. మరి పుస్తకం కొన్నావా? షర్టు మరీ అలా చిరిగిపోయిందేంటి అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment