
ప్రేమ పేరుతో తనను మోసం చేసి నగలు, డబ్బు తీసుకొని పారిపోయాడని ప్రియుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా. తనకు న్యాయం చేయాలని తమిళనాడు పోలీసులకు విజ్ఞప్తి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నానగర్‌కు చెందిన మనీశ్, జూలీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆమెకు మాయ మాటలు చెప్పి ఇంట్లోని నగలు, విలువైన వస్తువులతో పాటు నగదు తీసుకొని పారిపోయాడు. కొన్ని రోజులుగా అతని జాడ తెలియకపోవడంతో జూలీ అన్నానగర్ పోలీసులను అశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
ఇక జూలీ విషయానికొస్తే.. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో మొదటి సీజన్‌కి సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చింది. గతంలో చెన్నైలో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఆమె ఫేమస్ అయింది. ఆ ఉద్యమంలో ఆమె చేసిన నినాదాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో జూలీకి బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. అయితే షోలోకి వెళ్లిన కొద్ది రోజులకే తోటి కంటెంస్టెంట్‌తో గొడవపడి మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ లక్షలాది అభిమానులకు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా జూలీ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment