యావర్‌ చేతిలో ఎలిమినేషన్‌.. రతిక సేవ్‌ అయినట్లేనా? | Bigg Boss Telugu 7: Prince Yawar Won Eviction Free Pass | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: యావర్‌ చేతికి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌.. రతిక సేవ్‌? కానీ ఆ లేడీ కంటెస్టెంట్‌ బలి!

Published Thu, Nov 16 2023 11:26 AM | Last Updated on Thu, Nov 16 2023 11:46 AM

Bigg Boss Telugu 7: Prince Yawar Won Eviction Free Pass - Sakshi

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు టాప్‌ 10 స్థానాల కోసం కొట్టుకున్నారు. ఎవరికి వారు ఒకటో స్థానం నాదేనని వాదించారు. ఎలాగోలా ఆ ప్రక్రియ ముగిశాక బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్నవారిలో వీక్‌ అనుకుంటున్న కంటెస్టెంట్ల కోసం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ప్రవేశపెట్టాడు. ఇందుకోసం టాప్‌ 6 నుంచి 10 స్థానాల్లో నిలబడ్డ అమర్‌దీప్‌, అర్జున్‌, గౌతమ్‌, అశ్విని, రతిక పోటీపడ్డారు. అర్జున్‌ గెలిచి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలుచుకున్నాడు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు బిగ్‌బాస్‌. గెలిచిన అర్జున్‌ టాప్‌ 5లో ఉన్నవారితో పోటీపడి తన పాస్‌ను కాపాడుకోవాలనుకున్నాడు.

అర్జున్‌ నుంచి చేజారిన పాస్‌
అయితే బిగ్‌బాస్‌ ప్లాన్‌ చూస్తుంటే ఈ పాస్‌ అమ్మాయిలను కాపాడేందుకే ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. కానీ వారికి ఛాన్స్‌ ఇవ్వకుండా ప్రిన్స్‌ యావర్‌ గేములో రెచ్చిపోయాడు. అర్జున్‌ను ఓడించి ఆడి గెలిచాడు. తర్వాత శోభాతో ఆడిన గేములోనూ గెలిచాడు. అనంతరం పల్లవి ప్రశాంత్‌తో పోటీకి దిగి అక్కడా అతడే గెలిచాడు. ఇలా వరుసగా మూడు ఆటల్లో గెలిచి పాస్‌ను దక్కించుకున్నాడు. యావర్‌ కనిపించడం లేదు, డల్‌ అయిపోయాడు, ఫోకస్‌ తగ్గిపోయింది, దారి తప్పుతున్నాడు.. ఇలా ఎన్నో మాటలు పడ్డ యావర్‌ చివరకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఒక్కొక్కరినీ చిత్తుగా ఓడిస్తూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అక్కడివరకు బాగానే ఉంది.. కానీ ఈ పాస్‌ను ఎవరికోసం ఉపయోగిస్తాడు చెప్మా? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

తిరుగులేని యావర్‌..
తను ఎలాగో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ కాబట్టి తనకోసం వాడుకోడని కచ్చితంగా రతిక కోసం వాడుతాడని అంటున్నారు. బిగ్‌బాస్‌ తలిస్తే ఏదైనా జరుగుతుంది.. ఉల్టా పుల్టా అని చెప్పి.. నీకోసం కాకుండా ఇతరుల కోసం వాడాలంటే చచ్చినట్లు రతిక కోసం వాడతాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ లెక్కన ఈ వారం రతిక సేవ్‌ అయిపోయే ఛాన్స్‌ ఉంది. అంటే అప్పుడు ఎలిమినేషన్‌ గండం శోభా శెట్టికి చుట్టుకుంటుంది. అంటే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రజలు, బిగ్‌బాస్‌ చేతిలో కాదు.. యావర్‌ చేతిలో ఉందన్నమాట!

చదవండి: మరో రికార్డు సాధించిన జవాన్‌.. ఓటీటీలో తగ్గడం లేదుగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement