Viral Music Duo Sachet and Parampara Tandon to compose music for Prabhas Adipurush - Sakshi
Sakshi News home page

Adipurush: మ్యూజిక్‌ డైరెక్టర్లుగా సాచెత్‌-పరంపరాలు సంతకం!

Published Tue, Jun 8 2021 3:26 PM | Last Updated on Tue, Jun 8 2021 5:31 PM

Bollywood Music Directors Sachet And Parampara Signed To Adipurush - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే సీతగా కృతీసన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌లు సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇప్పటికే వీరు కబీర్‌ సింగ్‌, ఓం రౌత్‌ తెరకెక్కించిన తొలి చిత్రం తాన్హాజీ మూవీలకు సంగీతం అందించారు.

మ్యూజిక్‌ పరంగా ఈ రెండు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. దీంతో ఆదిపురుష్‌ కూడా సంగీత అందించే బాధ్యతలను డైరెక్టర్‌ సాచెత్‌, పరంపరాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ బ్యానర్‌పై భూషన్‌ కుమార్‌-కృష్ణ కుమార్‌-ప్రసాద్‌ సుతార్‌లు నిర్మిస్తున్నారు. భారీ బడ్జేట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా  చిత్రం వచ్చే ఏడాది అగష్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement