
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన వారంతా రాజమౌళి, తారక్, చరణ్‌లని ప్రశంసిస్తున్నారు. ఇక అలానే బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే అక్కడ ఎక్కువగా చరణ్‌ని ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్‌లో రామ్ చరణ్ 2013లోనే ‘జంజీర్’ సినిమాతో పరిచయమైనప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు.
ఇక దాంతో రామ్ చరణ్‌పై బాలీవుడ్ జనాలు తీవ్రంగా విమర్శించారు. లెజెండరీ నటుడు అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాని చెడగొట్టాడు అంటూ అక్కడి ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్ సైతం చరణ్ నటనపై మండిపడ్డారు. అయితే ఆ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్‌లో ఏ సినిమా చేయలేదు. కానీ సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి చెర్రీ అడుగుపెట్టాడు.
అయితే అప్పుడు ఎవరెవరైతే రామ్ చరణ్ నటనపై విమర్శించారో ఇప్పుడు వాళ్లతోనే గొప్ప నటుడు అనిపించుకోవడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసిన బాలీవుడ్ జనాలు రామ్ చరణ్ నటన చూసి శభాష్ అంటున్నారు. జంజీర్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’కు చెర్రీ నటనలో చాలా మార్పు వచ్చిందంటున్నారు. అంతేగాక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి చరణ్ నటన హైలైట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
ఇలా ఒకప్పుడు రామ్ చరణ్‌ని విమర్శించిన వారంతా ఇప్పుడు చెర్రీని ఆకాశానికెత్తేస్తుండటం గమనార్హం. అయితే విమర్శించిన వాళ్లు సైతం తిరిగి మనల్ని పొగిడినపుడే అసలైన విజయం సాధించినట్లు అనే మాటని రామ్ చరణ్ రుజువు చేశాడని చెప్పాలి. తనని విమర్శించిన వారందరికీ మళ్ళీ తన నటనతోనే సమాధానమిచ్చాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు మరింత స్పెషల్‌గా నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment