
తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్స్‌లో ఆయన చూపించే గ్రేస్‌కు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. డ్యాన్స్‌లో చిరంజీవి మెగా హీరోలతో పాటు మరేందరో మిగతా హీరోలకు కూడా ఆదర్శం. ఇక మెగాస్టార్, స్టైలీష్ స్టార్ కలిసి స్టెప్పులేస్తే.. చూడటానికి రెండు కళ్లు చాలవు కదా. ఈ అరుదైన సంఘటన ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో చోటు చేసుకుంది. కొణిదెల వారమ్మాయి నిహారిక పెళ్లి వేడుకలు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో నిహారిక-చైతన్యల వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్న అల్లు, కొణిదెల కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. సోమవారం నాటి సంగీత్ కార్యక్రమంలో వధూవరులు, మెగా హీరోలు డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లోనూ ఆ జోష్ కొనసాగించారు. (చదవండి: నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతి)
ఇక మెహందీ ఫంక్షన్ సందర్భంగా మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్ల స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం మామ అల్లుళ్ల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఆ కిక్కె వేరప్ప అంటూ తెగ సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా మంగళవారం ఈ వేడుకకు జత కలవడంతో ‘ఆఖరి ఆనందం వచ్చేసిందంటూ’ నాగబాబు ఫోటో షేర్ చేశారు. మెహందీ ఫంక్షన్‌లో మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment