Chiranjeevi Condolence Over Puneeth Rajkumar Death - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: నోటమాట రాలేదు : చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

Published Fri, Oct 29 2021 3:05 PM | Last Updated on Sat, Oct 30 2021 2:53 PM

Chiranjeevi Condolence Over Puneeth Rajkumar Death - Sakshi

Chiranjeevi Condolence Over Puneeth Rajkumar Death: కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది. శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి:  పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు)

పునీత్ మృతి చెందిన విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ "ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement