Comedian Khyali Saharan booked for rape case in Jaipur - Sakshi
Sakshi News home page

Khyali Saharan: హోటల్‌లో యువతిపై కమెడియన్‌ అత్యాచారం

Published Fri, Mar 17 2023 10:46 AM | Last Updated on Fri, Mar 17 2023 11:49 AM

Comedian Khayali Saharan Booked For Rape Case In Hotel Room In Jaipur - Sakshi

కమెడియన్‌ ఖ్యాలి సహరన్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ హోటల్‌లో కమెడియన్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు ఉద్యోగం కావాలంటూ ఓ నెల క్రితం కమెడియన్‌ ఖ్యాలి సహరన్‌ సాయం కోరారు. ఎలాగోలా ఉద్యోగం ఇప్పిస్తానంటూ సదరు కమెడియన్‌ వారికి హామీ ఇచ్చాడు. ఈ విషయంపై మాట్లాడదామంటూ ఇటీవల ఓ హోటల్‌లో రెండు గదులను బుక్‌ చేశాడు ఖ్యాలి. ఇద్దరు యువతులకు ఓ గది ఇచ్చి మిగతా గది తాను తీసుకున్నాడు. వారితో సంభాషిస్తున్న సమయంలో తను మద్యం తాగడమే కాక వారిని కూడా తాగమని బలవంతం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఓ యువతి అక్కడి నుంచి వెళ్లిపోగా మరో యువతిపై ఖ్యాలి అత్యాచారం చేశాడు. కాగా ఖ్యాలి ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement