సెలబ్రిటీలను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ వైరస్ బారిన పడగా తాజాగా ఓ హీరోయిన్‌కు సైతం పాజిటివ్ అని తేలింది. ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయాతి కరోనా బారిన పడగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వెల్లడించింది.
'అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. కొన్ని స్వల్ప లక్షణాలు లు మినహా ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నాను. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టే ఇది పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి, మాస్కులు ధరించండి, సానిటైజర్ వాడండి. త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను' అని హయాతి రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment