‘‘లవ్ యు రామ్’ చిత్రంలో తొలిసారి తప్పని పరిస్థితిలో నేను నటించాల్సి వచ్చింది. నటించే ముందు మొదట ట్రయిల్ షూట్ చేశాం.. అందరికీ నచ్చింది. ఇప్పటివరకూ ప్రీమియర్స్ చూసిన
అందరూ బాగా చేశానని అభినందించారు. ఇకపై నటన కొనసాగించాలనుకోవడం లేదు. నటుడిగా సక్సెస్ అయితే మాత్రం దర్శకత్వం కంటే నటనే చాలా ఈజీ (నవ్వుతూ)’’ అని కె. దశరథ్ అన్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ లీడ్ రోల్స్‌లో డీవై చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ యు రామ్’. డైరెక్టర్ కె. దశరథ్ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా కె. దశరథ్ మాట్లాడుతూ– ‘‘డీవై చౌదరి, నేను మూడు వెబ్ సిరీస్‌లు చేశాం. ఆ తర్వాత ఒక చిన్న లవ్ స్టోరీ చేద్దామని ‘లవ్ యు రామ్’ కథ రాశాను. చాలామంది జీవితాల్లో జరిగే కథ ఇది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే ప్రేమకథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందిన మా సినిమా అందర్నీ అలరిస్తుంది. రోహిత్, అపర్ణ అంకితభావంతో పని చేశారు. వేద చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇండస్ట్రీలో ముందు యండమూరి, పరుచూరి బ్రదర్స్, తేజ గార్ల వద్ద రైటర్‌గా పని చేశాను. కానీ నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో వారి స్టయిల్ ఉండదు. నేను నాలా తీయడానికి ఇష్టపడతాను. కానీ, నేను రచయితగా పని చేసినప్పుడు మాత్రం కస్టమర్ ఈజ్ ది కింగ్. వాళ్లకి ఏం కావాలో అది ఇవ్వాలి. అలా ‘ఉస్తాద్’కి మాస్ కమర్షియల్ కథ అందించాను. ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ షో రన్నర్‌గా ఉంటారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment