Director Om Raut Revealed About Prabhas Character Name In Adipurush Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Om Raut-Adipurush: ఆదిపురుష్‌లో ప్రభాస్‌ పాత్ర పేరు రాముడు కాదు..

Published Wed, Feb 23 2022 4:42 PM | Last Updated on Wed, Feb 23 2022 5:14 PM

Director Om Raut About Prabhas And Adipurush Movie In a Interview - Sakshi

హీరో ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్‌ మూవీ ఒకటి. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది ఈ సినిమా. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకన్ని ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆది పురుష్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకడు ఓం రౌత్‌. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు టెక్కికల్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటుందని, దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పాడు.

చదవండి: మాజీ భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్‌ చేసిన నటుడు నరేష్‌

అలాగే ‘ఆదిపురుష్ కథను సినిమా తీయాలని ఎప్పుడో అనుకున్నాను. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో 45 రోజుల్లోనే ఆదిపురుష్ స్క్రిప్ట్ పూర్తి చేశాను. కథ రాసుకున్నప్పటి నుంచి నా మైండ్‌లో ఉంది ప్రభాస్ ఒక్కడే. ప్రభాస్ అయితేనే ఈ పాత్రని మోయగలడని అనిపించింది. కథ పూర్తి కాగానే ప్రభాస్‌ ఫోన్‌ చేసిన కథ గురించి చెప్పానను. కేవలం మూడు సన్నివేశాలు విని ప్రభాస్ ఓకే చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు పూర్తి కథ వినిపించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా!

‘వాల్మీకి రాసిన రామాయణంలోని మెయిన్ పాయింట్లను ‘ఆదిపురుష్’లో చూపిస్తాం. ఇందులో 7000 సంవత్సరాల క్రితం నాటి సెట్ వేశాం. రామాయణ కథని ఆధునిక కథా పద్ధతులతో చెప్పాను. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదు. రాముడికి మరో పేరు రాఘవ. అందుకే ఇందులో రాఘవుడు అని పేరు వాడాం. కృతి సనన్ పోషించిన సీత క్యారెక్టర్ జానకి పేరుతో పిలుస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ రావణుడు పాత్రకు లంకేష్ అని పేరు పెట్టాం. ఈ పేర్లన్నీ కూడా “రామాయణం” నుంచి తీసుకున్నవే. ఆదిపురుష్ అంటే “మొదటి మనిషి” అని అర్ధం అయితే మేము “ఉత్తమ పురుషుడు” అనే అర్ధంతో తీసుకున్నాం” అంటూ ఆదిపురుష్‌ గురించి ఆసక్తిగా చెప్పాడు డైరెక్టర్‌ ఓం రౌత్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement