
ఇది నేను కాదు, ఎందుకంటే నాకు మట్టి అన్నా, పచ్చదనం అన్నా అస్సలు నచ్చదు అని ట్వీట్ చేశారు. ఇష్టం లేదంటూనే మొక్కలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది, అబద్ధాలు
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సెపరేటు.. మనసుకు నచ్చిన పనులే చేస్తాడు. నచ్చని వాటి జోలికి కూడా వెళ్లడు. కానీ తాజాగా మాత్రం ఒక పని నచ్చదంటూనే పూర్తి చేశాడు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఒక మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు.
ఈ మేరకు ఓ ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ఇది నేను కాదు, ఎందుకంటే నాకు మట్టి అన్నా, పచ్చదనం అన్నా అస్సలు నచ్చదు అని ట్వీట్ చేశారు. 'ఇష్టం లేదంటూనే మొక్కలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది', 'అబద్ధాలు చెప్పడం కూడా రావట్లేదా ఆర్జీవీ', 'ఈ పచ్చదనమే లేకపోతే మన ఊపిరి ఆగిపోతుంది సార్' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This is not me because I hate green and mud pic.twitter.com/nFdEAROIes
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2022
My displeasure https://t.co/tF0xuhlq6z
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2022