
Sai Dharam Tej Accident Updates: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. సాయి తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడనే విషయం తెలియగానే.. ఆయన వాడిన బైక్ ఏంటి? దాని ధర ఎంత? అని నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
(చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్)
ఇక సాయి తేజ్ బైక్ విషయానికొస్తే.. దీన్ని ఆయన రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొలుగోలు చేశాడు. TS07 GJ1258 ఇది ఆ బైక్ రిజిష్ట్రేషన్ నంబర్. అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆయన వాడిన బైక్ ఖరీదు రూ. 11 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటుంది. ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్. దీని బరువు దాదాపు 200 కేజీల వరకు ఉంటుంది. బైక్ రైడింగ్ అంటే సాయి తేజ్‌కి చాలా ఇష్టం. విరామం దొరికితే చాలు తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అదే క్రమంలో వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగింది.