Evelyn Sharma Ties The Knot With Tushaan Bhindi In Country Style Ceremony In Australia - Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లాడిన బాలీవుడ్‌ నటి

Published Mon, Jun 7 2021 10:46 AM | Last Updated on Mon, Jun 7 2021 11:18 AM

Evelyn Sharma Ties The Knot With Tushaan Bhindi In Country Style Ceremony In Australia - Sakshi

బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ భిండిని పెళ్లాడింది. గత నెలలో వీరి వివాహం జరగ్గా, ఆలస్యంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన పెళ్లినాటి ఫొటోను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కన్నా సంతోషకరమైనది ఏముంటుంది? వైవాహిక జీవితానికి ఆరంభం పలికినందుకు ఎంతో ఎగ్జైట్‌ అవుతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరూ 2018లో ఫ్రెండ్స్‌ పార్టీలో తొలిసారి కలుసుకున్నారు. అలా మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది.

దీంతో ఆ మరుసటి ఏడాదే ధైర్యం చేసిన తుషాన్‌.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్‌ చేశాడు. అందుకు ఆమె అంగీకారం తెలపడంతో ఆ వెంటనే అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి గత నెలలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లితంతును పూర్తి చేశారు. ఎవలిన్‌ శర్మ 'ఏ జవానీ హై దీవాని', 'యారియన్‌' సహా పలు చిత్రాల్లో నటించింది. 'ఏ దిజవానీ హై దీవాని' చిత్రం రిలీజై ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి అయింది.

చదవండి: వెబ్‌ సిరీస్‌: ఫ్యామిలీమ్యాన్​ 2 రివ్యూ

రియాలిటీ షో ద్వారా సినిమాలో ఛాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement