
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ను మళ్లీ స్క్రీన్ మీద చూపించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్ అతని కో బ్రదర్ (కోబ్రా) వరుణ్ తేజ్. కానీ కోబ్రా లేకుండానే సెట్లోకి ఎంటర్ అవుతున్నారు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్‌లో చిత్రీకరించనున్నారు. పదిరోజులు సాగే ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్ పాల్గొంటారు. ఆయన కో బ్రదర్ వరుణ్ తర్వాతి షెడ్యూల్ నుంచి జాయిన్ అవుతారట. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 వేసవికి విడుదల చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment