Fan Express His Love On Samantha With Tattoos Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: సమంతే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ లవర్‌.. రీట్వీట్‌ చేసిన సామ్‌

Published Fri, Sep 17 2021 4:50 PM | Last Updated on Fri, Sep 17 2021 7:40 PM

Fan Express His Love On Samantha With Tattoos Tweet Goes Viral - Sakshi

Samantha Akkineni Tweet: హీరోలకు సమానంగా హీరోయిన్స్‌ను అభిమానించే ఫ్యాన్స్‌ను బయట చూస్తూనే ఉంటాం. ఇక హీరోయిన్స్‌ అంటే పడిచచ్చే కుర్రాళ్లు ఏకంగా వారి పేర్లు, ఫొటోలు టాటూ వేయించుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఓ యువకుడు భిన్నంగా చేతిపై టాటూ వేసుకుని హీరోయిన్‌పై ప్రేమను వ్యక్తం చేయడమే కాకుండా ఆ ఫొటోలను ట్వీటర్‌లో షేర్‌ చేస్తూ.. సదరు హీరోయిన్‌ను ట్యాగ్‌ చేశాడు. ఇంతకి ఆ హీరోయిన్‌ ఎవరో కాదు అక్కినేని కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత. అయితే ఆ యువకుడు చేసిన ట్వీట్‌ను సామ్‌ రీట్వీట్‌ చేయడంతో ఇది కాస్తా హాట్‌టాపిక్‌గా మారింది. 

చదవండి: స్పెయిన్‌ వెళ్లనున్న మహేశ్‌ బాబు

కాగా పవన్‌ సమ్ము పేరుతో ఓ నెటిజన్‌ ట్విటర్‌ ఖాతా ఓపెన్‌ చేశాడు. సమంత పేరును సమ్ము అంటూ టాటూ వేసుకుని ఆ ఫొటోలను షేర్‌ చేసి ఆమెను ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ‘మై ఫస్ట్‌ అండ్‌ మై లాస్ట్‌ లవ్‌ నువ్వే సమ్ము. నీపై ఉన్న ప్రేమ అనంతమైనది. ఇప్పుడ నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా శాశ్వతం’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన సామ్‌ ఆ యువకుడి ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. షాకింగ్‌ ఎమోజీలను జత చేసింది. సదరు ఫ్యాన్‌ ట్వీట్‌ చేయడం అలా ఉంచితే దీనిని సమంత రీట్వీట్‌ చేయడంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ పోస్ట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మిగతా ఫ్యాన్స్‌ సైతం సమంతపై ఉన్న తమ అభిమానాన్ని, ప్రేమను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: అమెరికాలో కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తున్న జగపతి బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement