'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు | Ram Charan Game Changer Movie Grand Teaser Launch Event In Lucknow, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు

Published Tue, Nov 5 2024 2:31 PM | Last Updated on Wed, Nov 6 2024 3:36 PM

Game Changer Teaser Launch Event In Lucknow

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను  రిలీజ్ చేసేందుకు టీమ్‌ ప్లాన్‌ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ వంటి మెట్రో సిటీల్లో టీజ‌ర్ లాంచ్ కానుంది.  న‌వంబ‌ర్ 9న‌ గ్రాండ్‌గా గేమ్‌ చేంజర్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

భారీ అంచ‌నాలున్న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో పాటు పలువురు సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ‘జ‌ర‌గండి జ‌రగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కింది.  ఈ నెల 9న టీజ‌ర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచ‌నాలు మరింత రేంజ్‌లో పెరగనున్నాయి. టీజర్‌ కోసం అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అవినీతి రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి ఎల‌క్ష‌న్స్‌ను నిబద్ధ‌త‌తో నిర్వ‌హించే ఆఫీస‌ర్‌గా మెప్పించనున్నారు.  జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను   శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఈ మూవీకి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement