‘నిజంగా దేవుడు ఉన్నాడా? దెయ్యాలు ఉన్నాయా? ఉంటే ఏ రూపంలో ఉన్నాయి? దేవుడు-దెయ్యాలు నిజమా? సైన్స్ నిజమా? ఇలా ప్రజల్లో చాలా అనుమానాలు, అపోహాలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాం’అన్నారు దర్శకుడు కొమారి జానకి రామ్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘జి.ఎస్.టి’. గాడ్ (దేవుడు)... సైతాన్ (దెయ్యం)... టెక్నాలజీ (సాంకేతికత) అనేది ఉపశీర్షిక. ‘తోలు బొమ్మల సిత్రాలు’ బ్యానర్ పై కొమారి జానయ్య నాయుడు నిర్మించారు. ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... ఈ చిత్రం కాన్సెప్ట్ చెప్పాకా, చాలా బాగా అనిపించింది .అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని,చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నాను’అన్నారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. సమాజంలో దేవుడు, దెయ్యం,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికే మేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాము. ఎందుకంటే.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో హర్రర్ సినిమాలు,దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ...ఈ మూడింటిని కలకలిపి వీటిలో అసలు ఏది వాస్తవం?ఏది అబద్దం అనే విషయాన్ని మేం చెప్పబోతున్నాం. హర్రర్ సినిమా అంటే ఒక వర్గానికి పరిమితమైన ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా లవ్, సెంటిమెంట్ ,కామెడీ ,హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంగీతం యు.వి.నిరంజన్; డీఓపీ డి.యాదగిరి.
Comments
Please login to add a commentAdd a comment