ఫోన్‌ నెంబర్‌ లీక్‌ చేసిన రాజ్‌ తరుణ్!‌ | Hero Raj Tarun Interaction With Netizens | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ప్రశ్న అడిగిన నెటిజన్‌, అంత ఆత్రం పనికి రాదన్న హీరో

Published Sun, Apr 4 2021 7:18 PM | Last Updated on Sun, Apr 4 2021 7:55 PM

Hero Raj Tarun Interaction With Netizens - Sakshi

అభిమాన నటుడు మెగాస్టార్‌ చిరంజీవి అని చెప్పిన యంగ్‌ హీరో తను మాత్రం మహేశ్‌బాబు ఫ్యాన్‌ అని అభిమానులను తికమక పెట్టాడు.

'ఉయ్యాల జంపాల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. తర్వాత చేసిన రెండు వరుస చిత్రాలు సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ సూపర్‌ హిట్‌ అవడంతో రాజ్‌ తరుణ్‌కు తిరుగు లేదనుకున్నారంతా. కానీ కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేయడంతో అంతే వేగంగా ఫ్లాప్‌లు నెత్తి మీద పడ్డాయి. దీంతో ఈసారి రూటు మార్చి లవర్‌ బాయ్‌గా కాకుండా ఓ సస్పెన్స్‌ కథ పవర్‌ ప్లే ద్వారా ప్రేక్షకుడి ముందుకు వచ్చాడు. కానీ అది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. ఈసారి మరో వైవిధ్య కథను ఎంచుకున్న రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం స్టాండ్‌ అప్‌ రాహుల్‌ సినిమా చేస్తున్నాడు. 

ఇదిలా వుంటే అతడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు పలు ప్రశ్నలను సంధించగా వాటన్నింటికీ ఓపికగా సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో క్రష్‌ ఎవరన్నదానికి తడుముకోకుండా సమంత అని టపీమని చెప్పాడు. అభిమాన నటుడు మెగాస్టార్‌ చిరంజీవి అని చెప్పిన యంగ్‌ హీరో తను మాత్రం మహేశ్‌బాబు ఫ్యాన్‌ అని అభిమానులను తికమక పెట్టాడు.

పనిలో పనిగా ఓ వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వొచ్చుగా అని అడిగాడు. అతగాడి కోరిక మేరకు 9848022338 అని నెంబర్‌ లీక్‌ చేశాడు. దీంతో కొందరు ఫ్యాన్స్‌ ఓవైపు షాకవుతూనే మరోవైపు ఆ నెంబర్‌కు దానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. అయితే అది స్విచ్చాఫ్‌ రావడంతో నువ్వు మమ్మల్ని మోసం చేశావని హీరోను నిందించారు. దీంతో అతడు తాపీగా అది తన నెంబర్‌ కాదని, శివమణి ఫోన్‌ నెంబర్‌ అని అసలు విషయం చెప్పాడు. ఇక త్వరలోనే అవికా గోర్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. తను 16 కుక్కపిల్లలను పెంచుకుంటున్నట్లు చెప్పాడు. తను వర్జినా అని నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు అంత ఆత్రం పనికి రాదని బదులిచ్చాడు. పెళ్లెప్పుడు అన్నదానికి కూడా తన దగ్గర సమాధానం లేదని తెలిపాడు.

చదవండి: చేసిన తప్పులు చేయకూడదు: రాజ్‌ తరుణ్‌

‘సర్కారు వారి పాట’కు కరోనా దెబ్బ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement