ఒక్క సినిమాతో తెలుగులో ఫుల్‌ క్రేజ్‌.. ఎవరో గుర్తుపట్టారా? | Heroine Honey Rose Shares Her Childhood School Pic, Trending On Social Media - Sakshi
Sakshi News home page

ఒక్క సినిమాతో టాలీవుడ్‌ను ఊపేసింది.. ఈ బ్యూటీ ఎక్కడుందో గుర్తుపట్టారా?

Published Fri, Mar 15 2024 12:25 PM | Last Updated on Fri, Mar 15 2024 1:57 PM

Heroine Honey Rose Shares Childhood Pic - Sakshi

స్కూల్‌ డేస్‌.. ఎవ్వరూ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అప్పుడు టీచర్‌ కొట్టినా, నాన్న తిట్టినా, స్కూలుకు వెళ్లనని ఏడ్చినా.. తర్వాత మాత్రం అవన్నీ వెనక్కు తిరిగి గుర్తుచేసుకుంటే పెదాలపై తెలియకుండానే ఓ చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. అలా ఓ బ్యూటీ తన స్కూల్‌ డేస్‌ గుర్తు చేసుకుంది. దమ్ముంటే పై ఫోటోలో నేను ఎక్కడున్నానో చెప్పండి అంటూ తన క్లాస్‌మేట్స్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసింది హనీ రోజ్‌.

ఇంకేముంది.. జనాలు తమ మెదళ్లకు పని పెట్టారు. కళ్లు ముక్కు, లుక్స్‌ గమనిస్తూ చబ్బీచబ్బీగా ఎవరున్నారా? అని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. చాలామంది హనీరోజ్‌ను ఇట్టే కనిపెట్టేశారు. పసుపు చీర కట్టుకున్న టీచర్‌ పక్కన అబ్బాయిలా కటింగ్‌ చేసుకున్న క్యూట్‌ విద్యార్థే హనీ అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో హనీరోజ్‌.. ఎస్‌.. అది నేనేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

ఇకపోతే.. బాయ్‌ఫ్రెండ్‌ అనే మలయాళ చిత్రంతో హనీరోజ్‌ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఆమె కేవలం రూ.10 వేలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాడీ షేమింగ్‌కు గురైన హనీరోజ్‌ ఆ కామెంట్స్‌ను తిప్పికొడుతూ మరింత అందంగా మారింది. బొద్దుగా, ముద్దుగా కనిపించే హనీ.. ఆలయం చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది. వీరసింహారెడ్డి సినిమాతో బోలెడంత క్రేజ్‌ తెచ్చుకుంది కానీ ఇక్కడ పెద్దగా ఛాన్సులైతే రాలేదు. ప్రస్తుతం మలయాళంలోనే సినిమాలు చేస్తోంది.

చదవండి: మళ్లీ ప్రేమ పుట్టదనుకుంటే మూర్ఖత్వమే.. పెళ్లి చేసుకుంటా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement