
కొందరు హీరోయిన్లని చూస్తే అబ్బా ఏమున్నార్రా బాబు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు వీళ్ల ఫొటోలని చూస్తే గుర్తుపట్టడమే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరూ ఒకరేనా లేదంటే వేర్వేరా అనే డౌట్ వస్తుంది. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. ఇంతలా చెప్పాం కదా మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?)
పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు హనీరోజ్. హా.. అవును 'వీరసింహారెడ్డి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ మలయాళ బ్యూటీ. గతంలో 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' అనే తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు అవి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది.
2005లో నటిగా కెరీర్ మొదలుపెట్టిన హనీరోజ్ ప్రస్తుత వయసు 32 ఏళ్లు. అంటే 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. కాకపోతే ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పుడు సన్నజాజిలా ఉన్న ఈమె ఇప్పుడు ముట్టుకంటే కందిపోయేంత సుకుమారంగా తయారైంది. ఫొటోలు, వీడియోలు చూశారంటే మీరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఈ క్రమంలోనే పాత ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో మరోసారి ఈమె హాట్ టాపిక్ గా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)