Heroine Rashmika Mandanna About Her Love Life - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna : నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రేమలో ఉందా? ఆమె ఏమందంటే.. 

Published Sat, Oct 8 2022 12:50 PM | Last Updated on Mon, Oct 10 2022 12:57 PM

Heroine Rashmika Mandanna About Her Love Life - Sakshi

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్‌తో స్టార్‌డమ్‌ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా తన ప్రేమ విషయం గురించి స్పందించింది.

Rashmika Mandanna

ఓ ఇంటర్వ్యూలో భాగంగా రష్మికకు.. మిమ్మల్ని నేషనల్‌ క్రష్‌ అంటారు. మరి మీకు ఎవరిపై అయినా క్రష్‌ ఉందా? మీ లవ్‌ లైఫ్‌ గురించి ఏం చెప్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఇప్పటికే నేను అందుబాటులో ఉండటం లేదంటూ నా ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ చెబుతుంటారు.రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్‌ ఇవ్వాలి.

Rashmika Mandanna

చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు అస్సలు టైమ్‌ ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతూ' అంటూ తానెవరితో రిలేషన్‌లో లేనంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. 

Rashmika Mandanna
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement