Hoping To Do A South Film Very Soon: Janhvi Kapoor - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: మళ్లీ రిపీట్‌ చేస్తున్నా.. రావడం పక్కా.. అది కూడా త్వరలోనే..

Published Sat, Dec 31 2022 6:59 AM | Last Updated on Sat, Dec 31 2022 8:25 AM

hoping to do a south film very soon: Janhvi Kapoor - Sakshi

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నటి జాన్వీ కపూర్‌. హిందీ చిత్రం దడక్‌ ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అందుకు కారణం ఆమె వారసత్వం కావచ్చు. సినీ రంగ ప్రవేశం చేసి నాలుగేళ్లు అయ్యింది. ఇప్పటివరకు ఆరు చిత్రాల్లోనే  నటించింది. అందులో గుంజన్‌ సక్సేనా, మిల్లి వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది.

అయితే ఆ చిత్రాలు మాత్రం ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అయితే నటనలో కంటే గ్లామర్‌తోనే జాన్వీకపూర్‌ ఎక్కువ పాపులర్‌ అయ్యిందనే చెప్పాలి. తరచూ స్కిన్‌ షో ప్రదర్శనతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. కాగా ఆమెను దక్షిణాదిలో పరిచయం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు  ఏ చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఈ బ్యూటీ కూడా దక్షిణ చిత్రాల్లో నటించాలని కోరుకున్నట్లు చెబుతూనే ఉంది. ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన జాన్వికపూర్‌ ఇంతకు ముందు చెప్పిందే మళ్లీ రిపీట్‌ చేసింది. దక్షిణాది చిత్రాల్లో నటించడం పక్కా అని, త్వరలోనే అది జరుగుతుందని చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement