ఏడాదికి ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని భావించేవారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడని తారక్ ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడైతే 'రౌధ్రం..రణం..రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్)' సినిమాకు కమిట్ అయ్యాడో ఏకంగా మూడేళ్లు మరో సినిమా చేయడానికి వీలు లేకుండా పోయింది. 2018లో అరవింద సమేతతో చివరిసారిగా థియేటర్‌లో సందడి చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆయన క్యాలెండర్ ఇయర్‌లో 2019, 2020, 2021 సంవత్సరాలు ఖాళీగా గడిచిపోయాయి.
గతంలో ఒక్క సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకునే ఎన్టీఆర్ ఇప్పుడు దాదాపుగా 50 కోట్లు అందుకుంటున్నాడు. ఈ లెక్కన ఏడాదికి ఒకటి చొప్పున మూడు సినిమాలు చేసినా రూ.150 కోట్లు పారితోషికం వచ్చి ఉండేది. కానీ మూడేళ్లుగా ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లకపోవడంతో భారీ మొత్తంలో నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం తనకూ, ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. దీంతో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజైన వెంటనే ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment