ఆయన కోరారు.. ఈయన ఓకే అన్నారు.. | Ilayaraja Visits AR Rahman Firdaus Studio At Dubai | Sakshi
Sakshi News home page

AR Rahman-Ilayaraja: ఆయన కోరారు.. ఈయన ఓకే అన్నారు..

Published Tue, Mar 8 2022 8:20 AM | Last Updated on Tue, Mar 8 2022 8:20 AM

Ilayaraja Visits AR Rahman Firdaus Studio At Dubai - Sakshi

సాక్షి, చెన్నై: సంగీతజ్ఞాని ఇళయరాజా, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ దుబాయ్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఇళయరాజా ముందు ఏఆర్‌ రెహమాన్‌ తన కోరికను వ్యక్తం చేశారు. అంతే వెంటనే ఇళయరాజా కూడా పచ్చజెండా ఊపేశారు. ఆ ముచ్చటేంటో చూద్దాం.. సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల దుబాయ్‌ ఎక్స్‌పో  కార్యక్రమంలో భారీ సంగీత విభావరిని  నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీన ముగిసింది. దీంతో ఆయన అక్కడ ఏఆర్‌ రెహమాన్‌కు చెందిన ఫిర్ధోస్‌ రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లారు.

ఇళయరాజాను.. రెహమాన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రెహమాన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మ్యాస్ట్రో ఇళయరాజాను ఫిర్ధోస్‌ స్టూడియోస్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో ఆయన తమ స్టూడియోలో రికార్డింగ్‌ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పోస్ట్‌కు స్పందించిన ఇళయరాజా త్వరలోనే దుబాయ్‌లోని ఏఆర్‌ రెహమాన్‌ స్టూడియోలో రికార్డింగ్‌ నిర్వహిస్తానని ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement