'Anantha' Trailer: Prashant Karthi, Anish Kuruvilla and Rittika Chakraborty Starring Movie - Sakshi
Sakshi News home page

మరణం వైపు మనిషి ప్రయాణం అంటూ సాగే 'అనంత' ట్రైలర్‌

Published Tue, Jun 6 2023 3:05 PM | Last Updated on Tue, Jun 6 2023 3:46 PM

Impressive trailer of Ananta - Sakshi

సినిమాల్లో కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న చిత్రం 'అనంత'. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని గతంలో ఎప్పుడు చూడని కోణంలో కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు డైరెక్టర్ మధు బాబు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా అనంత  మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ కార్తీ హీరోగా నటిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు RK రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్‌’ ప్రతి థియేటర్‌లో ఆయన కోసం ఒక టికెట్‌ రిజర్వ్‌)

ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా అనంత ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ఆసక్తికర సన్నివేశాలు చూపిస్తూ సినిమా కథను రిఫ్లెక్ట్ చేశారు. మనిషి పుట్టిన మరు క్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది అనే డైలాగ్ సినిమా సోల్ ఏంటో తెలుపుతోంది. మనిషి ఆయుష్షు నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుందని అర్థమవుతోంది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇదో డిఫరెంట్ కథ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్‌'!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement