ఫ్రిజ్‌లో ఈగలు దాచిన రాజమౌళి.. ఎందుకంటే..? | Interesting Facts About Eega Movie Directed By Rajamouli | Sakshi
Sakshi News home page

Rajamouli: ఫ్రిజ్‌లో ఈగలు దాచిన రాజమౌళి.. ఎందుకంటే..?

Published Sun, Jan 9 2022 6:41 PM | Last Updated on Sun, Jan 9 2022 6:51 PM

Interesting Facts About Eega Movie Directed By Rajamouli - Sakshi

Interesting Facts About Eega Movie Directed By Rajamouli: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మోస్ట్‌ అవేటెడ్‌ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) విడుదల వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షక జనం తీవ్ర నిరాశకు గురైంది. అయితే మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పెద్ద హీరోలను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్‌ చేస్తున్నాడంటే ఆ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. రాజమౌళి ఏ సినిమా చేసిన ఎంతో పరిశోధన చేసి, తాను అనుకున్నట్లుగా ఔట్‌పుట్‌ వచ్చేవరకు నిద్రపోడు. తాను సంతృప్తి చెందేవరకూ సన్నివేశాన్ని చెక్కుతూనే ఉంటాడు. అందుకే అతన్ని 'జక్కన్న' అని ముద్దుగా పిలుస్తారు. తాను అనుకున్నట్లుగా సన్నివేశం వస్తుందో లేదో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటానని రాజమౌళి ఎన్నో ఇంటర్వ‍్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. 

ఆయన తీసే ప్రతి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తారు. అందుకు ఎంత పరిశోధన అయినా చేస్తారు అని చెప్పేందుకు 'ఈగ' సినిమానే ఒక ఉదాహరణ. ఈగ సినిమా కోసం రాజమౌళి ఏం చేశారో  ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు ఇటీవల బయటపెట్టారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ఈగ' సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఈగ చిత్రం కోసం పనిచేసేప్పుడు రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్‌లో ఉంచాడట. ఆ ఫ్రిజ్‌లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని తారక్‌ చెప్పినట్లు సమాచారం. 

ఈగల సుప్తావస్థ (హైబర్‌నేషన్‌) గురించి తెలుసుకునేందుకే జక్కన్న అలా చేశారని రామ్‌ చరణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో వాటి మనుగడ ఎలా ఉంటుందో పరిశీలించేవారని చరణ్‌ పేర్కొన్నాడట. చిత్రబృందంతో కలిసి ఈగల ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేవారట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక సినిమా కోసం జక్కన్న ఎంత కష్టపడతారో అని. 2012లో విడుదలైన ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్ సమంత, నేచురల్‌  స్టార్ నాని జంటగా నటించారు.  కన్నడ హీరో సుదీప్‌ విలనిజం ఎంతగానో ఆకట్టుకోగా 'ఈగ' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2 నేషనల్‌, 3  సైమా, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను వరించింది.

 
ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు అమెజాన్‌ భారీ ఆఫర్‌.. కానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement